ఏడేండ్లలో ఏడు కిలోమీటర్ల రోడ్డా? : తిరుపతిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-22T05:14:57+05:30 IST

ఏడేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏడు కిలోమీటర్ల రోడ్డు పునర్నిర్మించారా అని మెదక్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ప్రశ్నించారు.

ఏడేండ్లలో ఏడు కిలోమీటర్ల రోడ్డా? : తిరుపతిరెడ్డి
పాదయాత్రను ప్రారంభిస్తున్న కంఠారెడ్డి

నిజాంపేట, అక్టోబరు 21 : ఏడేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఏడు కిలోమీటర్ల రోడ్డు పునర్నిర్మించారా అని మెదక్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. గురువారం నిజాంపేట మండల పరిధి రాంపూర్‌ గ్రామం నుంచి నిజాంపేట వరకు ఏడు కిలోమీటర్ల మేర పాడైపోయిన రోడ్డును పునర్నిర్మించాలని కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి పెద్దఎత్తున పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిజాంపేటలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంపూర్‌ నుంచి నిజాంపేట వరకు రోడ్డు అధ్వాన్నస్థితిలో ఉన్నదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం అంబులెన్స్‌ కూడా రాకుండా రోడ్డు పాడైందని మండిపడ్డారు. నిజాంపేట మండలం ఏర్పడి ఐదేళ్లు గడుస్తున్నా సొంత భవనాలు, సరైన సిబ్బంది, వసతులు కల్పించలేకపోయారని తెలిపారు. ఎమ్మెల్యే సొంత గ్రామం కోనాపూర్‌ సొసైటీలో జరిగిన రెండు కోట్ల 26 లక్షల అవినీతిపై వెంటనే న్యాయ విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రమే్‌షరెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు రామచంద్రాగౌడ్‌, మండలాధ్యక్షుడు లింగంగౌడ్‌, నసీరొద్దీన్‌, కాంగ్రెస్‌ నాయకులు మధుసూదన్‌రెడ్డి, పంజా మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:14:57+05:30 IST