కరోనా తరువాత భయపెడుతున్న డెంగ్యూ... మధురలో ఏడుగురు మృతి!

ABN , First Publish Date - 2021-08-25T15:39:08+05:30 IST

యూపీలో కరోనా వైరస్ చాలావరకూ అదుపులోకి వచ్చింది.

కరోనా తరువాత భయపెడుతున్న డెంగ్యూ... మధురలో ఏడుగురు మృతి!

మధుర: యూపీలో కరోనా వైరస్ చాలావరకూ అదుపులోకి వచ్చింది. అయితే ఇంతలోనే డెంగ్యూ ప్రభలడం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. యూపీలోని మధురలో డెండ్యూ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. నాగ్లా మానా గ్రామంలో డెంగ్యూతో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. 


మృతులలో ఒక బాలునితో పాటు 19 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. డెంగ్యూ కారణంగా ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో వైద్యాధికారుల్లో కలకలం చెలరేగింది. ఈ నేపధ్యంలో జిల్లా వైద్యాధికారి నవనీత్ సింగ్ చహల్... డెంగ్యూ మరణాలు సంభవించిన ప్రాంతం నుంచి నమూనాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్హా గ్రామంలో వారం రోజుల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధితో ఆరుగురు మృతి చెందారు. సుమారు 80 మంది బాధితులు మధుర, ఆగ్రా, భరత్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2021-08-25T15:39:08+05:30 IST