Abn logo
Nov 22 2020 @ 08:56AM

విశాఖలో అర్ధరాత్రి భారీ చోరీ..40 తులాల బంగారం అపహరణ

విశాఖ: జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి భారీ చోరీ చేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి సమయంలో.. విశాఖపట్నంలోని అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో జరిగింది. అయితే.. ఇంట్లోకి ప్రవేశించిన ఏడుగురు దుండగులు యజమానులను కత్తులతో, కర్రలతో గాయపరిచి బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. యజమానులు చెప్పిన వివరాల ప్రకారం..దుండగులు మొత్తం 40 తులాల బంగారం, రూ. లక్ష అపహరించారని పోలీసులకు తెలిపారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Advertisement
Advertisement