నిరంతర విద్యుత్ సరఫరాకు ఏడేళ్లు

ABN , First Publish Date - 2021-11-26T02:54:23+05:30 IST

రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏడేళ్లు పూర్తయినట్లు సీఎండీ

నిరంతర విద్యుత్ సరఫరాకు ఏడేళ్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏడేళ్లు పూర్తయినట్లు ఎస్పీడీసీఎల్ టీఎస్ సంస్థ ఎండీ రఘుమారెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషించిదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6,36,074 నూతన వ్యవసాయ కనెక్షన్లను ఇచ్చామన్నారు. వీటి కోసం రూ.2398.89 కోట్లు ఖర్చు చేశామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో విద్యుత్ వాహనాలకు అనుగుణంగా తమ సంస్థ సబ్ స్టేషన్లలో, ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని రఘుమారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పం, సిబ్బంది సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భవిష్యత్తులోను ప్రభుత్వ సహకారంతో నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. 




Updated Date - 2021-11-26T02:54:23+05:30 IST