Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్యాన్‌కు వేలాడుతున్న తండ్రి శవం.. ఆ రాత్రి అసలేం జరిగిందో చెప్పిన ఏడేళ్ల కూతురు..!

ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ వ్యక్తి మంగళవారం రాత్రి ఉరేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అందరూ భావించారు.. అయితే పోస్ట్‌మార్టమ్‌లో అది హత్య అని తేలింది.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి అతనిని హత్య చేసిందని తెలిసింది.. ఆ ఘటనను చూసిన ఏడేళ్ల కూతురు సాక్ష్యం చెప్పింది.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ ఘటన జరిగింది. 


మెయిన్‌పురికి చెందిన మనోజ్ భార్య ఖుష్బూ.. అభిషేక్ మిశ్రా అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ తరచుగా కలుస్తుండేవారు. ఆ విషయం మనోజ్‌కు తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీంతో మనోజ్‌ను కడతేర్చడానికి అభిషేక్‌తో కలిసి ఖుష్బూ స్కెచ్ వేసింది. మంగళవారం రాత్రి ఏడేళ్ల కూతురి ఎదురుగానే ప్రియుడితో కలిసి ఖుష్బూ భర్తను గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఇద్దరూ కలిసిమృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీశారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్‌లో మనోజ్‌ది హత్య అని తేలింది. దీంతో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. విచారణలో ఖుష్బూకు అభిషేక్‌తో వివాహేతర సంబంధం ఉందనే విషయం బయటపడింది. ఇక, ఏడేళ్ల కూతురిని ప్రశ్నించగా ఆ చిన్నారి మొత్తం విషయం చెప్పింది. తండ్రిని తల్లి, అభిషేక్ కలిసి చంపడం చూశానని, ఎవరికీ చెప్పొద్దని తనను బెదిరించారని పోలీసుల ఎదుట చెప్పింది. దీంతో పోలీసులు ఖుష్బూను, అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement