హరికృష్ణకు ఏడో స్థానం

ABN , First Publish Date - 2020-09-21T08:42:18+05:30 IST

సెయింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌లో బ్లిట్జ్‌-1లో ప్రపంచ అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన తెలుగు ..

హరికృష్ణకు ఏడో స్థానం

సంయుక్త విజేతలు కార్ల్‌సన్‌, వెస్లీ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సెయింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌లో బ్లిట్జ్‌-1లో ప్రపంచ అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ హరికృష్ణ బ్లిట్జ్‌-2లో ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఆదివారం జరిగిన బ్లిట్జ్‌-2 పోటీల 4వ రౌండ్లో కార్ల్‌సన్‌తో తలపడిన హరి 47 ఎత్తుల్లో ఓడిపోయాడు. మొత్తం 9 రౌండ్లు ముగిసేసరికి రెండింట్లోనే నెగ్గడంతో బ్లిట్జ్‌-2లో హరికి 3 పాయింట్లు లభించాయి. హరి ర్యాపిడ్‌, బ్లిట్జ్‌-1, బ్లిట్జ్‌-2లో కలిపి 15.5 పాయింట్లు సంపాదించడంతో సంయుక్తంగా ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. కార్ల్‌సన్‌ (నార్వే), వెస్లీ (అమెరికా) అన్ని విభాగాల్లో కలిపి 24 పాయింట్లు దక్కించుకోవడంతో సంయుక్త విజేతలుగా నిలిచారు. 

Updated Date - 2020-09-21T08:42:18+05:30 IST