సారా తయారీదార్లపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-04T06:13:05+05:30 IST

సారా తయారీలో పదేపదే అరెస్టు అయితే కఠిన చర్యలు అవలంభిస్తామని అదనపు ఎస్పీ కె.చక్రవర్తి హెచ్చరించారు.

సారా తయారీదార్లపై కఠిన చర్యలు
స్వాధీనం చేసుకున్న సారా, నిందితులను చూపుతున్న ఏఎస్పీ

అదనపు ఎస్పీ చక్రవర్తి 

పలుచోట్ల సారా స్వాధీనం.. ఊట ధ్వంసం

కైకలూరు, మే 3: సారా తయారీలో పదేపదే అరెస్టు అయితే కఠిన చర్యలు అవలంభిస్తామని అదనపు ఎస్పీ కె.చక్రవర్తి హెచ్చరించారు.  కైక లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సారా కేసు వివరాలను వెల్లడించారు. మంగళవారం గుమ్మళ్ళపాడులో ఘంటసాల శ్రీరామ్‌, ఘంటసాల దుర్గాప్ర సాద్‌ నుంచి సుమారు రూ. 90 వేల విలువైన 300 లీటర్ల సారాను స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరు కొల్లేరు అభయారణ్య పరిధిలో సారా తయారుచేసి తమ ఇంటి వద్దే దాచి ఉంచారని రూరల్‌ పోలీసులు చాకచక్యంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారన్నారు. సారా తయారు చేసేవారితోపాటు సహకరించే వారిపైన కూడా చర్యలు చేపడతా మన్నారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అఽధిక మొత్తంలో విక్రయించే దుకాణదార్లపై కేసులు నమోదు చేసి,   షాపుల లైసెన్సుల రద్దు చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో 700 మందిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసినట్లు తెలిపారు.  సమావేశంలో సీఐ వై.వి.వి.ఎల్‌. నాయుడు, ఎస్‌ఐ సి.హెచ్‌.కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో.... 

కైకలూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను  అరెస్టు చేసినట్టు సీఐ ఎస్‌.రాంబాబు తెలిపారు. పందిరిపల్లె గూడెంలో సారా విక్రయిస్తున్న ఘంటసాల నాగరాజును అదుపులోకి తీసుకుని 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే మండవల్లి మండలం అయ్యవారి రుద్రవరం గ్రామంలో మద్యం విక్రయిస్తున్న కుంచె పెంటయ్యను అదుపులోకి  తీసుకుని 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. 


పోతనపల్లిలో 800 లీటర్లు  ఊట ధ్వంసం

చాట్రాయి: మండలంలోని పోతనపల్లి చిన్న తండాలో సారా బట్టీలపై మంగళవారం పోలీసులు దాడి చేశారు.  800 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేసి, 3 లీటర్లు  సారా స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు  ఎస్‌ఐ ప్రతాపరెడ్డి తెలిపారు.  

ముసునూరు:  చిల్లబోయనపల్లి గ్రామంలో మంగళవారం రెండు ప్రదేశాల్లో దాడులు నిర్వహించి 500 లీటర్లు బెల్లం ఊట ద్వంసం చేసినట్లు ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. జుజ్జవరపు వెంకటేశ్వరావు, జోగి శోభనాచలంపై కేసు నమోదు చేసినట్టు  చెప్పారు.

Read more