హద్దుమీరిన ఖాకీ! మహిళా నాయకురాలిని అరెస్టు చేసే సమయంలో..

ABN , First Publish Date - 2020-09-20T16:20:25+05:30 IST

తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన ఎస్‌ఎఫ్‌ఐ మహిళా నాయకురాలిని..

హద్దుమీరిన ఖాకీ! మహిళా నాయకురాలిని అరెస్టు చేసే సమయంలో..

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన ఎస్‌ఎఫ్‌ఐ మహిళా నాయకురాలిని అరెస్టు చేసే సమయంలో ఒక సీఐ హద్దుమీరారు. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి జీపు ఎక్కించారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో వున్న టూటౌన్‌ సీఐ వెంకటరావు...మహిళలను తాకకూడదనే (ఎటువంటి సందర్భంలోనైనా మహిళా పోలీసులే నియంత్రించాలి) నిబంధన వున్నప్పటికీ స్వయంగా చేతులు పట్టుకుని లాక్కెళ్లి జీపులో ఎక్కించడం చర్చనీయాంశంగా మారింది.     


Updated Date - 2020-09-20T16:20:25+05:30 IST