Abn logo
Sep 25 2021 @ 00:20AM

మాంటిస్సోరి విద్యార్థులకు న్యాయం చేయాలి

ధర్నాలో పాల్గొన్న స్కూల్‌ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

మాంటిస్సోరి విద్యార్థులకు న్యాయం చేయాలి

విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎస్‌ఎఫ్‌ఐ నేతల ధర్నా

విజయవాడ సిటీ, సెప్టెంబరు 24: నగరంలోని మాంటిస్సోరి హైస్కూల్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.కోటి, ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులను టీసీలు తీసుకుని వెళ్లాలని చెప్పడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల్లోని సిబ్బందిని ప్రభుత్వానికి సరెండ్‌ చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంగా మారిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఎయిడెడ్‌ విద్యాసంస్థలు నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయన్నారు. మాంటిస్సోరి విద్యార్థులకు అక్కడే తరగతులు కొనసాగించాలని, లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.