Abn logo
Sep 28 2021 @ 00:05AM

కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టాలు రద్దుచేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

గుంటూరు(విద్య), సెప్టెంబరు 27: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలను తక్షణం రద్దుచేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బంద్‌ నిర్వహించారు. భారతబంద్‌లో భాగంగా నగరంలోని పలు విద్యాసంస్థల్ని మూయించారు. అనేక విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారని పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే నూతన విద్యావిధానం తీసుకువచ్చి నిధులు ఇవ్వకుండా కేంద్రం పెత్తనం చేస్తోందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగాలు భర్తీచేయడం లేదన్నారు. రైతుల్ని ఇబ్బందులపాలు చేసే చట్టాలను తీసుకువచ్చి వారిని అప్పుల పాలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు నగర నాయకులు కిరణ్‌, పూర్ణ, మహేష్‌, నాగూర్‌బి, కిన్నెర, గోపి, రాజేశ, తిరుమల, డేవిడ్‌, బాషా తదితరులు పాల్గొన్నారు.