Abn logo
Sep 27 2021 @ 23:55PM

ఎస్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ

విద్యార్థులకు చెక్కులు అందజేస్తున్న పిడికిటి తిలక్‌బాబు తదితరులు

గుంటూరు(విద్య), సెప్టెంబరు 27: ఎన్నారై ఎడ్యుకేషనల్‌ సొసైటీ అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌ (సొసైటీ ఫర్‌ రూరల్‌ స్కాలర్స్‌) ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేదవిద్యార్థులకు సోమవారం ఉపకార వేతనాలు పంపిణీచేశారు. ఈ విద్యాసంవత్సరం మొత్తం 50 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేసినట్లు ఎన్నారై ఇండియన స్ర్పింగ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిడికిటి తిలక్‌బాబు వెల్లడించారు. బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీఫార్మసీ, ఏజీబీఎస్సీ చదివే విద్యార్థులకు రూ.10 లక్షల మేర ఉపకార వేతనాలు అందజేశామని తెలిపారు. సంస్థ కార్యదర్శి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆయా విద్యార్థులకు చెక్కులు అందజేశారని వెల్లడించారు. ఎస్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.30కోట్ల మేర విద్యార్థులకు ఉపకార వేతనాలుగా అందజేసినట్లు తిలక్‌బాబు వెల్లడించారు. కార్యక్రమంలో మన్నవ రవిప్రసాద్‌, ఎన్నారై ఇంజనీరింగ్‌ కళాశాల సీఈవో పి. రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.