‘నన్నడిగావ్ కదా... పెళ్లెందుకు చేసుకుంటున్నావ్? అని. నువ్వెందుకు చేసుకుంటున్నావ్?’ హీరోయిన్‌కు హీరో ప్రశ్న! ‘ఫర్ సేఫ్ సెక్స్’ అమె ఆన్సర్. ‘షాదీ ముబారక్’ చిత్రం ట్రైలర్లో చివరి సంభాషణ. వాళ్లిద్దరి కథేంటో తెలియాలంటే మార్చి 5న థియేటర్లకు వెళ్లాలి. వీర్ సాగర్, దృశ్యా రఘునాథ్ జంటగా ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న విడుదల కానుంది.
‘‘మంచి చిత్రాన్ని మా సంస్ధ నుంచి విడుదల చేద్దామని ఈ చిత్రాన్ని టేకోవర్ చేశా. 2.15 గంటల ఈ చిత్రం ఆద్యంతం నవ్విస్తుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. నాదీ గ్యారెంటీ’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. హీరో వీర్ సాగర్ మాట్లాడుతూ ‘‘ఈ టీజర్, ట్రైలర్‌లోని టెంపో సినిమాలోనూ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు పద్మశ్రీ, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, సహ నిర్మాత శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.