Abn logo

షాహీ పనీర్‌

కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ ముక్కలు- సగం కప్పు, జీడిపప్పు ముక్కలు- రెండు స్పూన్లు, బాదంపప్పు ముక్కలు - స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- అర స్పూను, నెయ్యి- మూడు స్పూన్లు, ధనియాల పొడి, కారం, జీర- అర స్పూను చొప్పున, పెరుగు- అర కప్పు, చక్కెర- స్పూను, ఉప్పు, నీళ్లు- తగినంత, పనీరు- 200 గ్రాములు, బిర్యానీ ఆకు- 1, లవంగాలు- మూడు, యాలకుల పొడి- కొంచెం.


తయారుచేసే విధానం: ఓ కడాయిలో ఉల్లి ముక్కలు, జీడిపప్పు, బాదంపప్పు, అల్లం, వెల్లుల్లి వేసి నీళ్లు పోసి ఓ పదినిమిషాలు ఉడికించాలి. నీటిని వడగట్టి ఆరిన తర్వాత పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత నెయ్యిలో సుగంధ ద్రవ్యాలతో పాటు ఉల్లి మిశ్రమం, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపి ఎనిమిది నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి పెరుగు, చక్కెర, ఉప్పు, యాలకుల పొడి కలపాలి. మరీ చిక్కగా అయితే కాస్త నీళ్లను వేయవచ్చు. పనీరు ముక్కల్ని వేసి బాగా కలిపి అయిదు నిమిషాల దించేసి, పైన కొత్తిమీర ఆకుల్ని అలంకరిస్తే షాహీ పనీర్‌ సిద్ధం.

కీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌మసూర్‌ దాల్‌ కర్రీవంకాయ కొత్తిమీర కారం కూరథాయ్‌ గ్రీన్‌ కర్రీడుబ్కీ వాలే ఆలూషాహీ బిండీ క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా
Advertisement