శభాష్‌ విహాన్‌!

ABN , First Publish Date - 2020-12-03T05:48:18+05:30 IST

ఏడేళ్ల బుడతడు అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజధానులు, జాతీయపతాకాలు, తెలుగు సంవత్సరాలు...

శభాష్‌ విహాన్‌!

ఏడేళ్ల బుడతడు అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజధానులు, జాతీయపతాకాలు, తెలుగు సంవత్సరాలు... ఇలా ఒక్కటేమిటి ఏది అడిగినా ఠక్కున సమాధానం చెబుతున్నాడు.


విశాఖపట్టణంకు చెందిన సాయి విహాన్‌ తమ్మన తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. నాలుగైదు దేశాల జాతీయ పతాకాలు గుర్తుపెట్టుకోవడమే కష్టం. అలాంటిది సాయి విహాన్‌ 198 దేశాల జాతీయ పతాకాలను గుర్తిస్తాడు. వాటి రాజధాని నగరాల పేర్లు, కరెన్సీ పేర్లు గుక్కతిప్పుకోకుండా చెబుతాడు.


తెలుగు సంవత్సరాల పేర్లు, తిథులు, నక్షత్రాలు, రుతువులు... ఇలా ఏది అడిగినా చెప్పేస్తాడు. మన రాష్ట్రాల రాజధానుల పేర్లు కొట్టిన పిండి.


విహాన్‌ తన అద్భుతమైన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు. 

Updated Date - 2020-12-03T05:48:18+05:30 IST