Advertisement

యాక్షన్ సీన్ల కోసం ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటున్న Shah Rukh Khan.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు షారూఖ్ ఖాన్. 2018లో విడుదలైన జీరో సినిమా అనంతరం ఆయన నుంచి ఎటువంటి చిత్రం రాలేదు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు అంచనాలను అందుకోలేకపోయింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ చిత్రంలో ప్రస్తుతం షారూఖ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలన్ని హాలీవుడ్ స్టైల్‌లో ఉండనున్నాయని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం షారూఖ్ ఒకరి నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ‘‘ షారూఖ్ పెద్ద కొడుకు ఆర్యన్‌‌ఖాన్‌కు యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి మంచి అభిరుచి ఉంది. అందువల్ల ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం తన ఇన్‌పుట్స్‌ను తీసుకుంటున్నారు ’’ అని ప్రాజెక్టుకు సంబంధించిన వ్యక్తి తెలిపారు. ఆర్యన్‌కు హాలీవుడ్ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలపై మంచి పట్టు ఉంది. బాలీవుడ్ సినిమాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌పై తన అభిప్రాయాన్ని తరచుగా తన తండ్రితో పంచుకుంటారు. పఠాన్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకోవాలని షారూఖ్ కోరుకుంటున్నారు. అందువల్ల తన కొడుకు అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు.  పఠాన్ చిత్రంలో జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...