Aryan Khan’s drugs case: షారూక్‌కు అభిమానుల మద్దతు!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నెల రెండో తేదీన ఆర్యన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం షారూక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ముంబై స్పెషల్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది ముంబై హైకోర్టును ఆశ్రయించారు. 


కొడుకు అరెస్ట్‌తో విషాదంలో మునిగిపోయిన షారూక్‌కు బాలీవుడ్ ప్రముఖులందరూ మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీలే కాదు.. షారూక్ అభిమానులు కూడా అండగా నిలబడుతున్నారు. షారూక్ నివాసం మన్నత్‌ ముందు ఆదివారం వారంతా తమ మద్దతు తెలిపారు. `డియర్ షారూక్.. మేం నిన్ను నమ్ముతున్నాం.. మేమంతా నీతో ఉన్నాం.. త్వరలోనే అంతా సర్దుకుంటుంది.. మళ్లీ మంచి రోజులు వస్తాయి` అని ఫ్లకార్డులు పట్టుకుని నిలుచున్నారు. కాగా, ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హై కోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. 

Advertisement

Bollywoodమరిన్ని...