షారూక్ మేనేజర్ Pooja Dadlani కి సమన్లు

షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక కోర్టు ఆ పిటిషన్‌‌ను అనేక సార్లు తిరస్కరించింది. అనంతరం అతడు ముంబై హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్‌ను సంపాదించాడు. ఈ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కింగ్ ఖాన్ నుంచి డబ్బులు లాగాడానికే  ఆర్యన్‌ను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరిక్కించారని మహారాష్ట్ర మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. 


తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. షారూక్ మేనేజర్ పూజ దడ్లానీ‌కి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. డబ్బును ఎరగా వేసి కేసును దారి మళ్లించడానికి ఆమె ప్రయత్నించిందనే ఆరోపణాలతో పోలీసులు ఆమెకు తాఖీదులు ఇచ్చారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి చెందిన విజిలెన్స్ విభాగం కూడా ఆమెకు సమన్లు అందజేసినట్టు తెలుస్తోంది. ఎన్సీబీకి చెందిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ) ముందు హాజరుకావడానికి ఆమె కొంత సమయం కావాలని అడుగుతోంది.    

Advertisement