Oct 27 2021 @ 15:11PM

షారూఖ్ మేనేజర్ పూజా గతంలో చేసిన ఓ పోస్ట్.. తాజాగా వైరల్.. Aryan Khan గురించి ఆమె చెప్పిన మాటలివి..!

బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా అతడికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ప్రత్యేక కోర్టు‌ ఆ పిటిషన్‌ను  తిరస్కరించింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు షారూఖ్ మేనేజర్ పూజ దడ్లానీ కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రజలు నెట్టింట్లో వెతకడం మొదలెట్టారు. గతంలో ఆర్యన్ ఖాన్ గురించి ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆర్యన్‌ బర్త్‌డే రోజున పూజ దడ్లానీ 2019లో సెల్పీ తీసుకుంది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కింద..‘‘ తన తండ్రి తెలివి, తల్లిలా అందరితో కలిసిపోవడం వంటి లక్షణాలు ఆర్యన్‌కు వచ్చాయి. సున్నితమైన మనసు, మంచి హృదయం కలవాడు. టీనేజీ దాటినందుకు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ’’ అని ఆ పోస్ట్ కింద రాసింది. పూజ దడ్లానీ 2012 నుంచి షారూఖ్‌కు మేనేజర్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా ఆమె అనేకసార్లు ఎన్సీబీ కార్యాలయాన్ని సందర్శిస్తూనే ఉంది. 

ఆర్యన్ కేసును తారుమారు చేయడానికి ఆమె ప్రయత్నిస్తోందని ఆరోపణాలున్నాయి. డ్రగ్స్ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కేపీ. గోసవి బాడీగార్డ్ అయిన ప్రభాకర్ సెయిల్ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గోసవిని మభ్య పెట్టడానికి ఆమె ప్రయత్నించిందని ప్రభాకర్ సెయిల్ చెబుతున్నారు. 


ఆమె సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెబుతూ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొదని కోర్టు ఎదుట వాదిస్తున్నారు. ప్రత్యేక కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆర్యన్ ముంబై హైకోర్టు మెట్లెక్కాడు. 




Bollywoodమరిన్ని...