అఫ్రీది ఆల్‌టైమ్‌ లెవెన్‌లో సచిన్‌

ABN , First Publish Date - 2020-04-09T10:04:05+05:30 IST

పాకిస్థాన్‌ మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ షాహిద్‌ అఫ్రీది తన ఆల్‌టైమ్‌ లెవెన్‌ జట్టును ప్రకటించాడు. ఇందులో సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌కు చోటు కల్పించాడు...

అఫ్రీది ఆల్‌టైమ్‌ లెవెన్‌లో సచిన్‌

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ షాహిద్‌ అఫ్రీది తన ఆల్‌టైమ్‌ లెవెన్‌ జట్టును ప్రకటించాడు. ఇందులో సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌కు చోటు కల్పించాడు. పాంటింగ్‌ను మూడు, సచిన్‌ను నాలుగో నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా ప్రటించాడు. ఓపెనర్లుగా సయీద్‌ అన్వర్‌, ఆడమ్‌ గిల్‌క్రి్‌స్టను తీసుకున్న అఫ్రీది..కీపర్‌గా రషీద్‌ లతీ్‌ఫను ఎంపిక చేయడం గమనార్హం. 

అఫ్రీది జట్టు:  అన్వర్‌, గిల్‌క్రిస్ట్‌, పాంటింగ్‌, సచిన్‌, ఇంజమామ్‌, కలిస్‌, రషీద్‌ లతీఫ్‌, అక్రమ్‌, వార్న్‌, మెక్‌గ్రాత్‌, షోయబ్‌ అక్తర్‌.

Updated Date - 2020-04-09T10:04:05+05:30 IST