ఉర్సు ఉత్సవాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘన... 500 మందిపై కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-07-29T11:45:14+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో షాహ్జీ మియా 118 ఉర్సు ఉత్సవాల్లో...

ఉర్సు ఉత్సవాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘన... 500 మందిపై కేసు నమోదు!

పీలీభీత్: ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో షాహ్జీ మియా 118 ఉర్సు ఉత్సవాల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతికి మించి అధికంగా జనాన్ని ఆహ్వానించినందుకు నిర్వాహకులతో పాటు 500 మందిపై కోవిడ్-19 ప్రొటోకాల్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 


వివరాల్లోకి వెళితే పట్టణం మధ్యలోనున్న షాహ్జీ మొహమ్మద్ షేర్ మియా దర్గాలో ప్రతీ యేటా ఉర్సు సందర్భంగా మేళా నిర్వహిస్తుంటారు. ఈ మేళాను చూసేందుకు దేశవిదేశాల నుంచి అన్ని మతాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. అయితే ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి కారణంగా మేళాను నిర్వహించడం లేదు. అయితే ఈ ఉత్సవాలను 50 మందితో నిర్వహించుకునేందుకు అధికారులు అనుమతినిచ్చారు. ఈ అనుమతులకు మించి జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఉత్సవాల నిర్వాహకులతో పాటు 500 మందిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-29T11:45:14+05:30 IST