షకీలా సూపర్‌స్టార్‌ ఫస్ట్‌లుక్‌

ABN , First Publish Date - 2020-12-13T07:15:59+05:30 IST

బాలీవుడ్‌ నటి రిచాచద్దా టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘షకీలా’. మలయాళ నటి షకీలా జీవిత కథ ఆధారంగా తెరకె క్కిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్లలో విడుదలవుతోంది...

షకీలా సూపర్‌స్టార్‌ ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్‌ నటి రిచాచద్దా టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘షకీలా’. మలయాళ నటి షకీలా జీవిత కథ ఆధారంగా తెరకె క్కిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్లలో విడుదలవుతోంది. ‘గుంజన్‌ సక్సేనా’ ‘మీర్జాపూర్‌’ వెబ్‌సిరీ్‌సలో నటనతో మంచి గుర్తింపు దక్కించుకున్న పంకజ్‌ ఈ చిత్రంలో ఓ దక్షిణాది సూపర్‌స్టార్‌ నటుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో రిచాచద్దా లాంటి ప్రతిభావంతురాలైన నటితో కలసి తెరను పంచుకోవడం సంతోషంగా ఉంది. తొలిసారి తెరపై నేను ఓ నటుడి పాత్రను పోషిస్తున్నాను. ఇదొక ఆసక్తికరమైన, కలర్‌ఫుల్‌ క్యారెక్టర్‌’’ అన్నారు.

Updated Date - 2020-12-13T07:15:59+05:30 IST