వికెట్లను తన్ని..అంపైర్‌తో వాదులాడి

ABN , First Publish Date - 2021-06-12T10:39:59+05:30 IST

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు. ఒకటిదికాదు రెండుసార్లు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించాడు.

వికెట్లను తన్ని..అంపైర్‌తో వాదులాడి

షకీబల్‌ దురుసు ప్రవర్తన


ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు. ఒకటిదికాదు రెండుసార్లు తీవ్ర ఆగ్రహం ప్రదర్శించాడు. శుక్రవారం జరిగిన ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  మహ్మడన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ కెప్టెన్‌ షకీబల్‌..తన బౌలింగ్‌లో అబానీ లిమిటెడ్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ ఎల్బీకోసం అప్పీల్‌ చేశాడు. అయితే అంపైర్‌ అప్పీల్‌ను తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన షకీబల్‌ వికెట్లను తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.  రెండో ఉదంతంలో..వర్షం రావడంతో అంపైర్లు కవర్లు తీసుకురావాల్సిందిగా సూచించారు. దాంతో షకీబల్‌ ఆగ్రహంతో వికెట్లను పీకి నేలకేసి కొట్టాడు. కాగా..తన ప్రవర్తనకు షకీబల్‌ అనంతరం క్షమాపణలు చెప్పాడు.  

Updated Date - 2021-06-12T10:39:59+05:30 IST