నా భర్తను విలన్‌ని చేస్తున్నారు.. ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ భార్య

ABN , First Publish Date - 2021-06-13T01:42:50+05:30 IST

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను అతడి భార్య ఉమ్మీ అల్ హసన్ వెనకేసుకొచ్చింది. తన భర్త చాలా మంచోడని

నా భర్తను విలన్‌ని చేస్తున్నారు.. ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ భార్య

ఢాకా: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను అతడి భార్య ఉమ్మీ అల్ హసన్ వెనకేసుకొచ్చింది. తన భర్త చాలా మంచోడని, అతడిని విలన్‌ని చేయాలని చూస్తున్నారని మండిపడింది. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో భాగంగా నిన్న మహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్-అబహానీ లిమిటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. షకీబ్ బౌలింగ్ వేసిన వెంటనే ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన షకీబల్ వికెట్లను బలంగా తన్ని అంపైర్‌తో వాదులాటకు దిగాడు.


షకీబల్ ప్రవర్తన క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత 5.5 ఓవర్ల వద్ద వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆపివేశారు. దీంతో షకీబల్ మరోమారు చెలరేగిపోయాడు. మరో బంతి వేసి ఉంటే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితం తేలే అవకాశం ఉండేదని, బంతి వేసే అవకాశం ఉన్నా మ్యాచ్‌ను ఆపేసారని ఆరోపిస్తూ వికెట్లను బలంగా పీకేసి విసిరిపడేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


షకీబల్ ప్రవర్తన తీవ్ర దుమారం రేపగా, అతడి భార్య ఉమ్మీ అల్ హసన్ మాత్రం భర్తను సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో పెద్ద పోస్టు చేసింది. అంపైర్ నిర్ణయంపై తనకు కూడా అనుమానం ఉందన్న ఆమె.. తన భర్తపై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. షకీబల్‌ను విలన్‌లా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు మరోవైపు మాత్రమే చూపించి అసలు విషయాన్ని దాచిపెడుతున్నారని ఆరోపించింది.


ఈ ఘటనపై మీడియా కంటే తానే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో నిజానిజాలేంటో తెలిసిన కొందరైనా అతడికి మద్దతుగా ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనలో అసలు సమస్య అంపైర్ల తప్పుడు నిర్ణయాలు దానిని సమాధి చేసి, కావాలని కక్షపూరితంగా షకీబ్‌ను విలన్‌ను చేసి చూపిస్తున్నారని ఉమ్మీ ఆవేదన వ్యక్తం చేసింది. 



Updated Date - 2021-06-13T01:42:50+05:30 IST