Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో దేశానికి వెళదామా ? క్రప్టో పెట్టుబడిదారుల్లో ఆందోళన..!

న్యూఢిల్లీ/ముంబై : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లు ‘ప్రవేశం’ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా దీనిచుట్టే చర్చ నడుస్తోంది. క్రిప్టోలో లక్షల సంఖ్యలో భారత ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం... క్రిప్టో బిల్లు అంశానికి సంబంధించిన వివరాల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు క్రిప్టో కరెన్సీని, క్రిప్టో ఎక్స్ఛేంజీలను నిషేధిస్తారని, లేదా తీవ్ర నియంత్రణ ఉంటుందని అబిప్రాయాలు వినవస్తున్నాయి. లోకసభలో ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు’ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. 


ఇన్వెస్టర్లలో ఆందోళన...

భారత్‌తో లక్షల సంఖ్యలో క్రిప్టో ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో ఆందోళన చెందుతున్నారు. క్రిప్టో బిల్లు నేపధ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పతనమయ్యాయి. అయితే క్రిప్టోకు  సంబంధించి ప్రభుత్వ నిర్ణయం అమలవుతుందా ? నిషేధం సాధ్యమేనా ? అన్న అంశాలపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. పెట్టుబడిదారులపై క్రిప్టో బిల్లు ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఆర్‌బీఐ ద్వారా కేంద్రం క్రిప్టో కరెన్సీని తీసుకురావచ్చన్న వ్యాఖ్యానాలు కూడా వినవస్తున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ క్రిప్టో కరెన్సీని వేరు చేయడం ద్వారా... ప్రైవేటు క్రిప్టోను నిషేధించవచ్చు, లేదా నియంత్రించవచ్చునని చెబుతున్నారు. అలాగే, క్రిప్టో లాభాలపై పన్నులు విధించే అవకాశాలు కూడా లేకపోలేదని వినవస్తోంది. ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ సర్వర్ నుండి, ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారో తెలుసుకోవడం కాస్త కష్టమైన అంశమే. క్రిప్టోను పూర్తిగా నిషేధించడం అసాధ్యమనన్న అభిప్రాయాలు తారస్థాయిలో వినవస్తున్నాయి. 

Advertisement
Advertisement