అమర వీరుడికి అవమానం

ABN , First Publish Date - 2020-08-03T22:45:46+05:30 IST

దేశం కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించాడు.

అమర వీరుడికి అవమానం

సంగారెడ్డి: దేశం కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించాడు. 21 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. తాజాగా ఆ కుటుంబం ఆవేదనను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను మానవ హక్కుల సంఘం ఆదేశించింది.


సంగారెడ్డికి చెందిన విజయకుమార్ 1999 కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యాడు. సైన్యంలో చేరిన ఏడేళ్లకే వీరమరణం పొందాడు. రెండు దశాబ్దాలు గడిచినా.. ప్రభుత్వాలు, పాలకులు మారినా అమరవీరుని కుటుంబానికి న్యాయం జరగలేదు. 1999లో అప్పటి ప్రభుత్వం విజయకుమార్ కుటుంబానికి ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఇంతరవకు ఆచరణ సాధ్యం కాలేదు.  ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ కాళ్లెరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. దేశం కోసం తన బిడ్డ ప్రాణత్యాగం చేస్తే కనీసం పట్టించుకునే నాథుడే లేడని ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంది.

Updated Date - 2020-08-03T22:45:46+05:30 IST