‘ఉపాధి హామీ’ని నిర్లక్ష్యం చేయడం సిగ్గు.. సిగ్గు..

ABN , First Publish Date - 2021-08-03T06:37:56+05:30 IST

ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సిగ్గుచేటని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు విమర్శించారు.

‘ఉపాధి హామీ’ని నిర్లక్ష్యం చేయడం సిగ్గు.. సిగ్గు..
కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణుల నిరసన

ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు


గుంతకల్లు, ఆగస్టు 2: ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సిగ్గుచేటని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు విమర్శించారు. సోమవా రం టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ ఆధ్వర్యం లో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జితేంద్రగౌడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చింద ని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన 70 శాతం నిధులకు తో డు 30 శాతం కలిపి పనులను కల్పించి, బిల్లులను ఇవ్వాల్సిన రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించిందన్నారు. కోర్టులో సై తం కేంద్రం నిధులు రాలేదని అపద్దాలు చెప్పారని పేర్కొన్నారు. 2018-19లో చేసిన పనులకు రూ.1210 కోట్ల బిల్లుల ను ప్రభుత్వం పెండింగులో పెట్టి, 2020లో పనులకు బిల్లులను చెల్లించడం తగదన్నారు. ఈ బిల్లుల కోసం వెళ్తే ఎ మ్మెల్యే వద్దకు వెళ్లండని చెబుతున్నారన్నారు. కొత్త ప్రభు త్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన పనులకు అలా చెప్పినా అ ర్థం ఉందని, మునుపటి బిల్లులకు అలా చెప్పడం అధికారు ల బాధ్యతారాహిత్యమన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి, గ్రామాలలోని నాయకులకు దాసోహం అనడం సి గ్గుచేటన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని ఉపాధి పనులను సక్రమంగా నిర్వహించి, బిల్లులను చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతంచేస్తామన్నారు. అనంత రం  ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  మాజీ ఎంపీపీలు రాయల రామయ్య, ప్రతాప్‌ నాయుడు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన జీ వెంకటేశులు, గుత్తి మా ర్కెట్‌ యార్డు మాజీ చైర్మన శ్రీనివాస యాదవ్‌, కౌన్సిలరు షరీఫ్‌, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు హనుమంతు, ఆ మ్లెట్‌ మస్తాన యాదవ్‌, మాజీ ఎంపీటీసీ తలారి మస్తాన ప్ప, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు గాలి మల్లికార్జున, ఎస్సీ సె ల్‌ జిల్లా అధ్యక్షుడు జింకల జగన్నాథ్‌, టీడీపీ నాయకులు ఆర్‌ పవన కుమార్‌ గౌడు, రామన్న చౌదరి, ఆటో ఖాజా, బొజ్జే నాయక్‌, శివన్న, రంగనాయకులు, మహదేవ్‌, నాగరా జు, కేఎల్‌ శీన, బలరాం, అశోక్‌, పాల్‌ పాల్గొన్నారు. 


నిధులను పక్కదారి పట్టించిన ప్రభుత్వం

కళ్యాణదుర్గం : ప్రభుత్వం ఉపాధి పనుల బిల్లులు మంజూరు చేయకపోవడం సిగ్గు చేటని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం ఉపాధి బిల్లుల మంజూరుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్‌ భవన నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి ర్యాలీ ని ర్వహించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పనుల బిల్లులు వి డుదల చేసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పక్కదారిపట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హక్కుగా అందాల్సిన ఉపాధి బిల్లులు మంజూరులో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల బి ల్లులు కూడా మంజూరు చేయలేదన్నారు. సీఎం జగనకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిల్లులు విడుదల చేయాలని డి మాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అ ధికారులు లేకపోవడంతో ఎంపీడీఓ ఖాళీ కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్టనారాయణ, మాదినేని మురళి, తలారి సత్యప్ప, రామరాజు, పోస్టుపాలన్న, శ్రీరాములు, కొల్లప్ప, అంజినేయులు, కొల్లాపురప్ప, నాగరాజు, వెంకటేశులు, బ్రిజేష్‌, అరవింద్‌, బిక్క గోవిందరాజులు, పెద్దన్న, హరి, రోషనవలీ, వన్నూర్‌స్వామి, సుధాకర్‌, చక్రపాణి, నారాయణస్వామి, రాజప్ప, రాజు, మో హన, నరసింహులు, అనీల్‌, పరమేష్‌, సోము పాల్గొన్నారు. 


ఆందోళన ఉధృతం చేస్తాం..

కంబదూరు: హైకోర్టు ఉత్తర్వుల మేరకు పెండింగ్‌లో ఉన్న ఉపాధిహామీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహనచౌదరి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి బిల్లులు చెల్లించాలని ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2500 కోట్ల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో చేపట్టిన బిల్లులను నిలిపివేసి కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపించారు. రా ష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమిలినేని లక్ష్మీనారాయణ, నాయకులు దండా వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, శివన్న, మల్లికార్జున, శీ న, నాగరాజు, బాబయ్య, మారుతి, రాజా, శివ, సన్నప్పయ్య, రవి, విజయ్‌కుమార్‌, గంగాధర పాల్గొన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : ఉపాధి హామీ కూలీలకు పెం డింగ్‌ బిల్లులను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు హనుమంతు, పసుపులేటి రా జు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కా ర్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి వినతిపత్రం అందించారు. ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లింపులు జరపాలని వారు కోరా రు. కూలీల సొమ్ము నెలల తరబడి చెల్లించకపోతే కుటుం బ పోషణ భారంగా మారుతోందన్నారు. ప్రభుత్వం వెం టనే స్పందించి కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించే వి ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన కడ్డిపూడి మహబూబ్‌ బాషా, మా జీ ఎంపీపీ రాఘవరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ పొరాళ్లు పురుషోత్త మ్‌, సర్పంచ మల్లేశప్ప, నాయకులు తిప్పేస్వామి, జమీల్‌ ఖాన, ఇనాయత, తిప్పేస్వామి, సిమెంటు శీన, పైతోట ఆం జనేయులు, ఇస్మాయిల్‌, సుంకన్న, నిరంజనగౌడ్‌, తిమ్మారె డ్డి పాల్గొన్నారు. 

పుట్లూరు: గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని చంద్రదండు అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు పే ర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఆయన ఇనచార్జ్‌ ఆనంద్‌ప్రసాద్‌ను కలిసి విన్నవించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఉపాధిహామీ, నీరు-చెట్టు, సీసీరోడ్ల బి ల్లులు కోట్ల రూపాయలు బకాయి పడ్డాయన్నారు. బిల్లులు ఇవ్వాలని కోర్టులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. చంద్రదండు మండల అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి భాస్కర్‌నాయుడు, దస్తగిరి, వెంకటరామిరెడ్డి, చంద్ర పాల్గొన్నారు. 


యాడికి: నరేగా కింద చేసిన పనుల బిల్లులను వెంటనే మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ మండల టీడీపీ నాయకులు సోమవారం ఇనచార్జ్‌ ఎంపీడీఓ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మా జీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి రు ద్రమనాయుడు మాట్లాడారు. నరేగా కింద చేపట్టిన పనుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆగస్టు ఒకటిలోపు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి కోర్టు మొట్టిక్కాయలు వేసినా చలనం లేకపోవడం ఏ మిటని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో వెంగన్నపల్లి ఉ ప సర్పంచు నాగమునిరెడ్డి, రాయలచెరువు మాజీ సర్పం చు గోపాల్‌నాయుడు, మాజీ ఎంపీటీసీ ఆదినారాయణ, టీ డీపీ నాయకులు రామచంద్రారెడ్డి, బయపురెడ్డి, నాగరాజు, నరేంద్రబాబు, నెట్టికంటయ్య, శివ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:37:56+05:30 IST