యూరప్‌లో షామీ ‘మై వాచ్‌’

ABN , First Publish Date - 2020-10-03T05:30:00+05:30 IST

చైనాకు చెందిన టెక్‌ జెయింట్‌ షామీ ‘మై వాచ్‌’ ని యూరప్‌లో విడుదల చేసింది...

యూరప్‌లో షామీ ‘మై వాచ్‌’

చైనాకు చెందిన టెక్‌ జెయింట్‌ షామీ ‘మై వాచ్‌’ ని యూరప్‌లో విడుదల చేసింది. భారత కరెన్సీలో దీని ధర సుమారుగా 8,500 రూపాయలుగా ఉంది. అయితే అధికారికంగా ఈ వాచీ అమ్మకాలు ఎప్పుడనేది మాత్రం తెలియజేయలేదు. అమ్మోల్డ్‌ అంటే స్మార్ట్‌ ఫోన్‌లో ఉపయోగించే డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. అలాగే సైడ్‌లో స్పోర్ట్స్‌ బటన్‌ కూడా ఉంటుంది. జిపిఎస్‌ కాకుండా ఆరు సెన్సర్లు ఇందులో ఉంటాయి. రెండు గంటల సేపు ఛార్జింగ్‌తో ఈ వాచీని పదహారు రోజులు ఉపయోగించుకోవచ్చు. కెమెరా, రిమోట్‌ ఫంక్షన్‌, నోటిఫికేషన్స్‌కు నేటివ్‌ ఎమోజీ, వాయిస్‌ కంట్రోల్‌ తదితరాలు ఉన్నాయి. 1.39 అంగుళాల అమోల్‌ డిస్‌ప్లేఓ 454 ్ఠ 454 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 450 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, 5ఎటిఎం వాటర్‌ రెసిస్టెన్స్‌, 420ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. ఇదే కంపెనీ మన దేశంలో ‘మై వాచ్‌ ఎవాల్వ్‌’ను ఇంతకుమునుపు విడుదల చేసింది. 

Updated Date - 2020-10-03T05:30:00+05:30 IST