ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-08-03T06:38:15+05:30 IST

రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులను వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతనివ్వడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎండీసీ) చైర్‌పర్సన్‌ జి.షమీం అస్లాం చెప్పారు. సోమవారం ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌గా ఆమె ప్రమాణస్వీకారం చేశారు.

ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ
ఏపీ ఎండీసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడుతున్న షమీంఅస్లాం

మదనపల్లె, ఆగస్టు 2:  రాష్ట్రంలో అపారమైన ఖనిజ వనరులను వినియోగంలోకి తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధికి చేయూతనివ్వడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎండీసీ) చైర్‌పర్సన్‌ జి.షమీం అస్లాం చెప్పారు. సోమవారం ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌గా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని  సంస్థ కార్యాలయంలో ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి... ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎండీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి, అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్యఅథితిగా హాజరై, షమీంఅస్లాంను పుష్పగుచ్ఛంతో అభినందించారు. కురబసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షమీం మాట్లాడుతూ... సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సహకారంతో ఏపీఎండీసీని మరింత ముందుకు తీసుకెళ్తాన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడానికి, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని షమీం పేర్కొన్నారు. సంస్థ పురోభివృద్ధికి ప్రజాప్రతినిధిగా తనకున్న అనుభవాన్ని వినియోగించుకుని అటు పర్యావరణం, ఇటు ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవకాశాలను వినియోగించుకుని సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి కలసికట్టుగా కృషి చేద్దామని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండీసీ జేడీ డి.శ్రీనివాసరావు, కంపెనీ  కార్యదర్శి ఆర్‌.మణికిరణ్‌, మార్కెటింగ్‌ జీఎం వీ.ఎస్‌.వీ బోస్‌, కోల్‌ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మణరావు, వీసీ అండ్‌ ఎండీ ఓఎస్డీ వెంకటసాయి, జియాలజీ డీజీఎం నతానియేలు, సివిల్‌ డీజీఎం శంభుప్రసాద్‌, ఎస్‌ అండ్‌ ఏ శ్రీనివాసమూర్తి, హెచ్‌ఆర్‌డీ డీజీఎం పి.సత్యనారాయణమ్మ, సీఎస్‌ఆర్‌ డీజీఎం రాజారమేష్‌, దేవిమంగ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-03T06:38:15+05:30 IST