Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. 300 కేజీల బరువుండే బైక్‌పై తన కుమారుడు జాక్సన్‌తో కలిసి వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అయి 15 మీటర్ల దూరం జారిపోయింది. ఈ ఘటనలో పెద్దగా గాయాలు కాకపోవడంతో వార్న్ ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రథమ చికిత్స చేసుకున్నాడు.


అయితే, ఉదయం లేచి చూసే సరికి పాదం కదపలేనంత నొప్పిగా ఉండడంతో తన కాలు విరిగిపోయి ఉంటుందని భయపడి ఆసుపత్రికి పరిగెట్టాడు. 52 ఏళ్ల వార్న్ వచ్చే నెల 8 నుంచి గబ్బాలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌కాస్టింగ్ విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఆ లోపు కాలికి అయిన గాయం తగ్గి కోలుకుంటాడని భావిస్తున్నారు.  

Advertisement
Advertisement