షేన్‌వార్న్‌కు కరోనా.. ఐసోలేషనలో మాజీ స్పిన్నర్

ABN , First Publish Date - 2021-08-02T23:13:19+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ స్పిన్సర్ షేన్ వార్న్ కరోనా బారినపడి ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వార్న్ ప్రస్తుతం లండన్ స్పిరిట్ పురుషుల

షేన్‌వార్న్‌కు కరోనా.. ఐసోలేషనలో మాజీ స్పిన్నర్

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్సర్ షేన్ వార్న్ కరోనా బారినపడి ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వార్న్ ప్రస్తుతం లండన్ స్పిరిట్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కొవిడ్ నిర్ధారణ కావడంతో సదరన్ బ్రేవ్-లండన్ స్పిరిట్ మధ్య నిన్న లార్డ్స్‌లో జరిగిన సరికొత్త ఇంగ్లిష్ క్రికెట్ పరిమిత ఓవర్ల ట్రోఫీ ‘ది హండ్రెడ్’ మ్యాచ్‌కు హాజరుకాలేకపోయాడు. ఉదయం నుంచి కాస్త నీరసంగా కనిపించడంతో నిర్వహించిన కరోనా పరీక్షల్లో వార్న్‌కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతడికి సన్నిహితంగా మెలిగిన మరో కోచ్ కూడా ఐసోలేషన్‌కు వెళ్లగా, ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని క్లబ్ తెలిపింది. 51 ఏళ్ల వార్న్ 1992-2007 మధ్య ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నాడు. కాగా, ట్రెంట్ రాకెట్స్ హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా గతవారం కరోనా బారినపడ్డాడు. 

 


Updated Date - 2021-08-02T23:13:19+05:30 IST