పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న ప్రభుత్వం : మంత్రి

ABN , First Publish Date - 2020-04-05T10:35:03+05:30 IST

రాష్ట్రంలోని 1.30 కోట్ల పేద కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1300కోట్లు ఖర్చుచేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు.

పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న ప్రభుత్వం : మంత్రి

గోరంట్ల, ఏప్రిల్‌ 4 : రాష్ట్రంలోని 1.30 కోట్ల పేద కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1300కోట్లు ఖర్చుచేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. ప్రతి రేషన్‌కార్డు దారులకు కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా చేయూతనివ్వడానికి వలంటీర్ల ద్వారా రూ.1000 నగదు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గోరంట్లలో మంత్రి ప్రారంభించారు. వడ్డివారి వీధిలో ఇంటింటికీ వెళ్లి నగదు అందజేశారు. అనంతరం పట్టణంలోని పులేరువీధి లో గుడిసెల్లో ఉంటున్న వారికి నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి సందర్శించారు.


ఐదుగురు డాక్టర్లు ఉండాల్సిన ఆసుపత్రిలో డా క్టర్‌ గిరిధర్‌ ఒక్కరే ఉండటంతో సరైన వైద్య సదుపాయం లభించడం లేదన్న స్థానికుల ఫిర్యాదుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్‌ను సందర్శించారు. ఉపాధ్యాయుడు నాగేనాయక్‌ ద్వారా పంచాయతీ కార్మికుల కు లాక్‌డౌన్‌ ముగిసేవరకు రెండు పూటలా ఆహారం అందించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కరోనా నివారణ చర్యల్లో భాగంగా నిరంతరం నిరంతరం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇస్తూ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారన్నారు. జిల్లాలో కరోనా చికిత్సలకోసం 4వేల బెడ్‌లు ఏర్పాటుచేసి 43క్వారంటైన్‌ సెంటర్లతోపాటు జిల్లాలో నాలుగు ఐసొలేషన్‌ సెంటర్లు, ప్రైవేట్‌ ఆసుపత్రిలో నెలకొల్పామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లికార్జున, ఫకృద్దీన్‌, వేణుగోపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రఘురాంరెడ్డి, రాజారెడ్డి, నూర్‌మహ్మద్‌, పాలేజయరాం నాయక్‌, రామచంద్రారెడ్డి, డాక్టర్‌ బాష, తదితరులు తహసీల్దార్‌ బాలకిషన్‌, ఎంపీడీఓ అంజినప్ప, సీఐ జయనాయక్‌, ఈఓసతీ్‌షకుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T10:35:03+05:30 IST