రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-05-17T19:12:47+05:30 IST

విశాఖ శారదాపీఠంలోని రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో సాగాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతిని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తమ స్వహస్తాలతో విశేష పూజలు నిర్వహించారు.

రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు

విశాఖ: విశాఖ శారదాపీఠంలోని రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో జరిగాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతిని పీఠాధిపతులు స్వరూపానంద, స్వాత్మానందేంద్ర తమ స్వహస్తాలతో విశేష పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా స్వరూపానంద మాట్లాడుతూ.. ఆదిశంకరాచార్యులు ప్రపంచానికే జగద్గురువు అని తెలిపారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందన్నారు.  శంకర భాష్యంపై శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు. నేటి నుంచి చాతుర్మాస్యం ముగిసే వరకు వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధిస్తున్నట్లు తెలిపారు. రిషికేశ్ వేదికగా గంగాతీరంలో శంకర జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని స్వరూపానంద పేర్కొన్నారు.

Updated Date - 2021-05-17T19:12:47+05:30 IST