నేటి తరానికి శంకరన్‌ జీవితం ఆదర్శం

ABN , First Publish Date - 2021-10-23T06:34:36+05:30 IST

బడుగు జీవులైన నిరుపేదలకు సేవ చేసిన త్యాగమూర్తి ఐఏఎస్‌ శంకరన్‌ జయంతి వేడకలు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

నేటి తరానికి శంకరన్‌ జీవితం ఆదర్శం
సమావేశంలో మాట్లాడుతన్న కలెక్టర్‌ హరికిరణ్‌

  • భానుగుడి(కాకినాడ), అక్టోబరు 22: బడుగు జీవులైన నిరుపేదలకు సేవ చేసిన త్యాగమూర్తి ఐఏఎస్‌ శంకరన్‌ జయంతి వేడకలు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జేసీ లక్ష్మీశ, డీఆర్‌వో సత్తిబాబు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ వైడీ రామారావు  ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దక్షిణ రా ష్ట్రంలో తమిళనాడులో తంజావూరు జిల్లాలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో శంకరన్‌ జన్మిం చారని, కుల, మత, భాష, ప్రాంతపరమైన అన్ని అడ్డుగోడలను ఛేదించి ఒక అభ్యుదయ వాదిగా పేదల పెన్నిధిగా నిలిచారన్నారు. తన పదవీ కాలంలో గిరిజన ప్రాంతంలో సింగ్‌లైన్‌ పరిపాల నకోసం ఇంటిగ్రేటెడ్‌ ట్రైబ్యునల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలను స్థాపించారన్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించగా ఎన్‌జీవ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివా సరావు, ఎస్సీ మానిటరింగ్‌ సభ్యులు నక్కా చిట్టిబాబు, ఆర్‌పీఐ నాయకలు పిట్టా వరప్రసాద్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు తోకల ప్రసాద్‌, కె.సత్తిబాబు, పీఎస్‌ నారాయణ, కుమార్‌, దళిత నాయకులు డొకుబుర్ర భద్రం, చింతపల్లి సుబ్బారావు, ఆడియారపు శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:34:36+05:30 IST