ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి రెడీగా ఉండండి : శరద్ పవార్

ABN , First Publish Date - 2020-03-30T20:14:48+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావం ఆర్థిక రంగం పై పడిందని, దానిని ఎదుర్కోడానికి రెడీగా ఉండాలని ఎన్సీపీ అధినేత

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి రెడీగా ఉండండి : శరద్ పవార్

ముంబై : కరోనా మహమ్మారి ప్రభావం ఆర్థిక రంగం పై పడిందని, దానిని ఎదుర్కోడానికి రెడీగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఫేస్‌బుక్ ద్వారా శరద్ పవార్ మహారాష్ట్ర ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా ఎఫెక్ట్ ఆర్థిక రంగంపై పడిందని, అనవసర, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ఇంటి పట్టునే ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆయన ప్రజలకు సూచించారు. ‘‘దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా పడింది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు సంసిద్ధంగా ఉండండి. రాబోయే వారాల్లో దేశ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉండే అవకాశముంది. అనవసర, దుబారా ఖర్చులను తగ్గించుకోండి’’  అని శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-30T20:14:48+05:30 IST