Abn logo
Oct 21 2021 @ 17:15PM

శారదా పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్న ప్రముఖులు

హైదరాబాద్: చందానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను గురువారం పలువురు ప్రముఖులు కలిశారు. చందానగర్ ఆలయ సముదాయంలో బసచేసిన పీఠాధిపతులను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి, సినీ నటుడు మురళీమోహన్, రంగారెడ్డి కలెక్టరు వినయ్ అమోయ్ కుమార్ తదితరులు ఆశీస్సులు అందుకున్నారు. చందానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న హరిహరుల వైభవోత్సవములలో భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. చండీయాగం వద్ద పూజలు చేశారు. ఆలయ సముదాయంలో దేవతామూర్తులను సందర్శించారు. అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి రాజశ్యామల అమ్మవారికి తమ స్వహస్తాలతో పీఠార్చన నిర్వహించారు. అమ్మవారికి నక్షత్ర హారతులిచ్చారు. పీఠార్చన అనంతరం భక్తులకు తీర్థం పంపిణీ చేశారు.

హైదరాబాద్మరిన్ని...