యాదాద్రి క్షేత్రంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-15T06:06:20+05:30 IST

మహార్ణవమిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిఽధిలో హరి హరుల ఆలయాల్లో గురువారం విశేష పూజలు కొనసాగాయి.

యాదాద్రి క్షేత్రంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
లక్ష్మీనృసింహులకు హారతి నివేదిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, అక్టోబరు14:  మహార్ణవమిని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిఽధిలో హరి హరుల ఆలయాల్లో గురువారం విశేష పూజలు కొనసాగాయి. ప్రధానాలయంలో స్వయంభువు లను కొలిచిన ఆచార్యులు బాలాలయంలో సువ ర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు హారతి నివేదిం చారు. ఉత్సవమూర్తులను వేద మంత్రాలతో అభిషేకించి అర్చించారు. విశ్వక్సేనుడికి తొలిపూ జలతో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. నవరాత్రి వేడుకల్లో భాగంగా హరిహరుల ఆల యాల్లో అమ్మవారిని కొలుస్తూ కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పాతగుట్ట ఆల యంలోనూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి గురువారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.3.50 లక్షల  ఆదాయం సమకూరిందని  దేవస్థాన అధికారులు తెలిపారు.



చారు. 

Updated Date - 2021-10-15T06:06:20+05:30 IST