అచ్చం టిక్‌టాక్‌లానే.. షేర్‌చాట్ తెచ్చిన ఈ యాప్‌తో..

ABN , First Publish Date - 2020-07-06T02:33:40+05:30 IST

’డిజిటల్ స్ట్రైక్‘లో భాగంగా 59 చైనా యాప్స్‌ను భారత్ రద్దు చేసిన తరుణంలో...

అచ్చం టిక్‌టాక్‌లానే.. షేర్‌చాట్ తెచ్చిన ఈ యాప్‌తో..

టిక్‌టాక్‌‌కు ప్రత్యామ్నయంగా షేర్‌చాట్ ‘మోజ్’ యాప్

న్యూఢిల్లీ: ’డిజిటల్ స్ట్రైక్‘లో భాగంగా 59 చైనా యాప్స్‌ను భారత్ నిషేధించిన తరుణంలో దేశీయ వినోద యాప్స్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నయంగా షేర్‌చాట్ తీసుకొచ్చిన ‘మోజ్’ అనే యాప్ విశేష ఆదరణ పొందుతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 4.2 రేటింగ్‌తో అత్యధిక డౌన్లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఈ యాప్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.


బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళంతో పాటు మొత్తం 15 భారతీయ భాషలతో ఈ యాప్‌ను రూపొందించారు. ఆంగ్ల భాష ఈ యాప్‌లో ఉండదు. టిక్‌టాక్‌లో మాదిరిగానే ఈ యాప్‌లో సొంతంగా వీడియోలు 15 సెకన్ల నిడివితో సృష్టించవచ్చు. ఫిల్టర్స్, స్టిక్కర్స్, ఎమోటికన్స్ వంటి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. లిప్‌సింకింగ్ అనే ఆప్షన్‌తో సినిమా డైలాగ్స్‌ను టిక్‌టాక్‌లో మాదిరిగానే అనుకరించవచ్చు.

Updated Date - 2020-07-06T02:33:40+05:30 IST