షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌కే మహిళల ఓటు

ABN , First Publish Date - 2020-03-09T07:06:59+05:30 IST

మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. వారి సంపాదన, పొదుపు కూడా పెరుగుతోంది.

షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌కే మహిళల ఓటు

పెట్టుబడుల లక్ష్యాల కోసం 82% మంది ప్రాధాన్యం వీటికే..

గ్రో సర్వే వెల్లడి 

మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. వారి సంపాదన, పొదుపు కూడా పెరుగుతోంది. అయితే వారి సొమ్మును మరింతగా పెంచుకునేందుకు పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటోంది. వీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, వారు పెట్టుబడులకు వేటికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న దానికి సంబంధించి తాజాగా గ్రో ఒక సర్వే నిర్వహించింది. ఆ వివరాలు..


82% మంది మహిళలు కంపెనీల షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడికి ప్రాధాన్యం ఇస్తున్నారు

43% మంది  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నారు 

25% మంది బంగారంలో పెట్టుబడికి మొదటి స్థానం కల్పిస్తున్నారు 

13% మంది రియల్‌ ఎస్టేట్‌, 9ు మంది పెన్షన్‌ స్కీమ్‌లను పెట్టుబడులకు ఎంచుకుంటున్నారు 

64% మంది మహిళలు ఆర్థికపరంగా విశ్వాసంతో ఉన్నారు. వీరు తమ సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు 

52% మంది మహిళలు రూ.5 లక్షల కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. వీరు చాలా యాక్టివ్‌గా పెట్టుబడి పెడుతున్నారు. వీరు స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ను తమ ప్రాధాన్య పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు 

59% మంది మహిళలు దీర్ఘకాలానికి పొదుపు చేస్తున్నారు. వీరిలో 50 శాతం మంది పెట్టుబడుల కాలపరిమితి 10 ఏళ్లకన్నా ఎక్కువగా ఉంది

26,000 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు

41% మంది మహిళలు తమ పెట్టుబడుల లక్ష్యం రిటైర్‌మెంట్‌ అని వెల్లడించగా.. మిగతా వారు తమ పిల్లల ఉన్నత విద్యా, వివాహాలుగా పేర్కొన్నారు 

ఐదేళ్లకన్నా తక్కువ కాలానికి పెట్టుబడి పెట్టిన వారు తమ వ్యక్తిగత అవసరాలు, తల్లిదండ్రుల మద్దతు కోసమని తెలిపారు 

అధిక రిటర్నులు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించినట్టు 80 శాతం మంది తెలిపారు 

సులభంగా పెట్టుబడులు పెట్టే సదుపాయం ఉండటం వల్ల పెట్టుబడులు పెడుతున్నామని 40 శాతం మంది పేర్కొనగా.. ఎప్పుడంటే అప్పుడు లిక్విడిటీ సదుపాయం ఉండటం వల్ల పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు 26 శాతం మంది వెల్లడించారు. 

Updated Date - 2020-03-09T07:06:59+05:30 IST