Abn logo
Sep 21 2021 @ 12:56PM

నేను దీక్ష చేసి తీరుతా.. చూస్కుందాం: షర్మిల

మేడ్చల్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందలమంది నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఇవాళ బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద దీక్ష చేయనున్నారు. అయితే దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీక్షకు పోలీసులు అనుమతివ్వకపోవడం బాధాకరమన్నారు. ఎలాగైనా దీక్ష చేసి తీరుతానని.. ఏం జరుగుతుందో చూస్కుందామన్నారు.


పోలీసులు టీఆర్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శించారు. కొన్నేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలంటూ ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌కి కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రశ్నించే స్థితిలో లేవన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగి చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని షర్మిల అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...