Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 16 2021 @ 13:24PM

KTR.. పెద్ద మొగోడు కదా.. ఏం చేస్తున్నారు?: షర్మిల

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులనే రివర్స్ ప్రశ్నించారు. ఆ తర్వాత పక్కనుండే మరో నేత ఆయనే మేడమ్.. సీఎం కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా షర్మిల నవ్వుకున్నారు. అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించిన ఆమె.. మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రశ్నించారు. 


అప్పుడే కేటీఆర్ మొగోడు అనుకుంటాం..

కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..?. నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వ్రతం చేస్తున్నాం. పెద్ద మొగోడు కదా కేటీఆర్.. ఏం చేస్తున్నారు..? తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలు భర్తీ చేస్తే మా వ్రతం ఫలించింది అనుకుంటాం. కేటీఆర్ మొగోడు అనుకుంటాం అని షర్మిల చెప్పుకొచ్చారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.


Advertisement
Advertisement