Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల కన్నీళ్లు KCR దొరకు కనిపించడం లేదు: వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘నేను పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతుండు. రెండు నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదు... వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయింది... అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారు?.. ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే మీ కండ్లు చల్లబడుతాయి?.. కల్లాల్లో ఉన్న రైతును కాటికి పంపుతున్నవ్‌?.. యాసంగి పంటలతో బిజీగా ఉండాల్సిన రైతును పాడె ఎక్కిస్తున్నావ్... వడ్లు కొనమని కాళ్ళు మొక్కించుకుంటున్నావ్.. మీది రైతు ప్రభుత్వం కాదు.. రైతును కాల్చుకు తింటున్న రైతు పాలిట రాబంధు ప్రభుత్వం’’ అంటూ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Advertisement
Advertisement