షర్మిల ఉద్యోగ దీక్ష వాయిదా

ABN , First Publish Date - 2021-11-16T00:21:24+05:30 IST

వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల మంగళవారం నిర్వహించే ఉద్యోగ దీక్ష

షర్మిల ఉద్యోగ దీక్ష వాయిదా

హైదరాబాద్‌: వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల మంగళవారం నిర్వహించే ఉద్యోగ దీక్ష వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దీక్షను షర్మిల వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని, దీక్షల కొనసాగింపు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎన్నికలు ఉన్న ప్రతిసారి ఉద్యోగాల భర్తీ అంటూ హామీలు తప్ప కార్యచరణ లేదన్నారు. వారంలో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా, కేసీఆర్‌లో చలనం లేదన్నారు. తమ దీక్షలను ఆపాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శాంతియుత దీక్షలకు పోలీసులు అనుమతివ్వడం లేదన్నారు. పోలీసుల వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-16T00:21:24+05:30 IST