Abn logo
Oct 27 2021 @ 23:07PM

అవకాశమిస్తే.. జీవితాంతం ప్రజలకు సేవచేస్తా

రాచులూరులో షర్మిల పాదయాత్ర

  • వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల


కందుకూరు / మహేశ్వరం / ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్‌ ఆర్‌టీపీ ఆవిర్భవించిందని.. నన్ను ఆశీర్వదించి అవకాశ మిస్తే జీవితాంతం ప్రజలకు సేవ చేస్తానని ఆ పార్టీ అధి నేత్రి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రస్థానంలో భాగంగా నిర్వహిస్తున్న పాదయాత్ర ఎనిమిదోరోజు విజయవంతంగా సాగింది. బుధవారం పాదయాత్ర కం దుకూరు మండలం తిమ్మాపురం శివారు నుంచి రాచు లూరు మీదుగా, బేగంపేట, మాదాపురం గ్రామాల మీదుగా చేవెళ్ల పార్లమెంట్‌నియోజకవర్గ పరిధి ముగించు కొని భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు గ్రామంలోకి ప్రవేశించింది. యాత్రలో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు, వృద్ధులతో షర్మిల మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్రలో యాం కర్‌ శ్యామల పాల్గొని షర్మిలతో కలిసి నడిచారు.

అనంతరం రాచులూరులో షర్మిల మాట్లాడారు. తెలం గాణ రాష్ట్రంలో కుటుంబపాలన రాజ్యమేలుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడి, వైఎస్‌ఆర్‌ సంక్షేమ రాజ్యాన్ని సాధించుకుందామన్నారు. వైఎస్‌ఆర్‌ పాలనలో వ్యవసాయం పండగలా ఉండేదని, ఇప్పుడేమో వ్యవసాయమెందుకు దండగ అన్నచందంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తయారుచేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల న్నారు. వైఎస్‌ఆర్‌పాలనలో రైతులకు పెద్దపీట వేసింద న్నారు. ఏడున్నరేళ్లలో రెండుసార్లు సీఎంగా కేసీఆర్‌కు అవకాశమిస్తే రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశాడని విమర్శించారు. మాటిచ్చి చెబుతున్నా.. వైఎస్‌ఆర్‌ బిడ్డగా ప్రజలకు సేవచేయడానికే పార్టీని స్థాపించానని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. మాట తప్పకుండా.. మడిమ తిప్పకుండా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతానన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు.. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క లబ్ధిదారుడికీ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. అదే వైఎస్‌ఆర్‌ పాలనలో కేవలం ఐదేళ్ల వంద రోజుల్లో 46 లక్షల కుటుంబాలకు పక్కాఇళ్లు ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. కాగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర విజయవంతమైనం దుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్దబావి వేణుగోపాల్‌ రెడ్డి, ఆయన సతీమణి సుధారెడ్డిలను షర్మిల కందుకూరు మండలం మాదాపురంలో ఘనంగా సన్మానించారు.


చేవెళ్ల పార్లమెంట్‌పరిధిలో పాదయాత్ర విజయవంతం

ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల ప్రారంభించిన పాద యాత్ర విజయవంతంగా సాగుతుందని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి అన్నారు. బుధ వారం తిమ్మాపురం రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 20న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభమై భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరుకుందని చెప్పారు. ఎనిమిదిరోజులుగా చేవెళ్ల, రాజేం ద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లోని ఐదు మండ లాలు, 47 గ్రామాల్లో 90కిలోమీటర్ల మేర యాత్ర సాగిందన్నారు. పాదయాత్రలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శల వినతులు కుప్పలు తెప్పలుగా వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, చెరుకు శ్రీనివాస్‌, అమృతాసాగర్‌, జాపాల కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.