Abn logo
Mar 2 2021 @ 03:22AM

షర్మిల పార్టీ ఏప్రిల్‌ 9న

షర్మిల పార్టీ విధానాలు  ఆరోజే

ఉమ్మడి పాలమురు జిల్లా అభిమానులతో నేడు భేటి


హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ విధి విధానాలను, భవిష్యత్‌ రాజకీయ ప్రయాణాన్ని ఏప్రిల్‌ 9న ప్రకటించే అవకాశం ఉందని ఆమె అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 9న ఖమ్మంలో ఆత్మీయ సమావేశం తర్వాత ఇందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన తెలంగాణ.. అందరి తెలంగాణగా మారాలని, కోరుకున్న అభివృద్ధి అందరికీ చెందాలని, యువత, మహిళా సమాజానికి ఒక అక్కలా అండగా నిలిచేందుకు షర్మిల వచ్చారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అభిమానులతో మంగళవారం లోట్‌సపాండ్‌లో షర్మిల సమావేశం కానున్నారు. 

Advertisement
Advertisement
Advertisement