షర్మిల పార్టీ సెగలు... కారణం ఏమిటి?

ABN , First Publish Date - 2021-07-31T23:29:51+05:30 IST

తెలంగాణ‌లో రాజ‌న్న‌రాజ్యాన్ని తీసుకోస్తానంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన ష‌ర్మిల‌కు ఆదిలోనే ఆటంకాలు

షర్మిల పార్టీ సెగలు... కారణం ఏమిటి?

హైదరాబాద్: తెలంగాణ‌లో రాజ‌న్న‌రాజ్యాన్ని తీసుకోస్తానంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన ష‌ర్మిల‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. వైఎస్సార్ టీపీకి రాష్ర‌వ్యాప్తంగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా క‌న్వీన‌ర్లు, కో క‌న్విన‌ర్ల‌ను కార్యవర్గసభ్యులను ష‌ర్మిల టీం ప్ర‌క‌టించింది. తాను సంక‌ల్పించిన పాద‌యాత్ర ప్రారంభంలోపు అన్ని గ్రామాల్లో త‌న పార్టీకి ఒక కార్య‌వ‌ర్గం ఉండాల‌ని, ప్ర‌తి చోట త‌న జెండా ఎగిరే విధంగా పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్లే భాద్య‌త‌ను నేతలకు ష‌ర్మిల అప్ప‌గించారు. అయితే క‌మిటీల ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఆ పార్టీలో అసంతృప్తి సెగ‌లు భ‌య‌ట‌ప‌డ్డాయి.


పార్టీకి మొద‌టినుంచి ప‌నిచేస్తున్న‌వారికి కాకుండా మ‌ద్య‌లో వ‌చ్చిన వాళ్ల‌కు ప‌ద‌వులు ఇచ్చార‌ని... ష‌ర్మిల టీంలోని  కీల‌క వ్య‌క్తులు వారి స్వ‌ప్ర‌యోజ‌నాల‌కోసం వారి వ్య‌క్తుల‌కు భాద్య‌త‌లు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున అస‌మ్మ‌తి నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ భ‌లోపేతంపై తాము చేసే కృషిని ష‌ర్మిల‌కు తెలియ‌కుండా తొక్కిపెడుతున్నార‌ని, లేనిపోని అపోహ‌లు సృష్టించి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా చేశారంటూ కొంత‌మంది నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. పెద్ద ఎత్తున ప‌ద‌వుల‌కోసం చేతివాటం చూపించార‌ని, ఇలా అయితే తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం క‌ష్ట‌మంటూ లోట‌స్ పాండ్ వ‌ద్ద అస‌మ్మ‌తి నేత‌లు ఆందోళ‌ను దిగిన విషయం తెలిసిందే.


అయితే ఈ ఆరోపణలను షర్మిల టీం తప్పుబడుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ అభివృద్ది కోసం ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి ష‌ర్మిల అవ‌కాశం ఇచ్చార‌ని... ఈ క‌మిటిలు ఏ ఒక్క‌రో ఇద్ద‌రో కూర్చొని రూపొందించ‌లేద‌ని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నేత‌ల పనితీరు ఆధారంగా పదవులు కట్టబెట్టామని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం పార్టీలో ఇంకా చాలా ప‌ద‌వులు ఉన్నాయ‌ని, అస‌మ్మ‌తి నేత‌ల‌కు పార్టీ ఇత‌ర ప‌ద‌వుల్లో చోటు క‌ల్పిస్తామని అసృంతృప్తి నేతలను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డ్డారు.

Updated Date - 2021-07-31T23:29:51+05:30 IST