Abn logo
Oct 11 2021 @ 20:52PM

నల్లగొండలో రేపు షర్మిల దీక్ష

నల్లగొండ: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో దీక్ష చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రత్యేక బస్సులో ఎంజీ యూనివర్సిటీకి చేరుకుని అక్కడి సమస్యలపై విద్యార్థులతో చర్చించనున్నారు. 10.40కు జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌కు చేరుకుని అమరవీరుల స్థూపానికి, శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకున్న యువకుల కుటుంబాలను పరామర్శించడానికి షర్మిల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె యాదాద్రిభువనగిరి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నల్లగొండ జిల్లాలోని చండూరు మండల కేంద్రంలో నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పరామర్శించారు. 

ఇవి కూడా చదవండిImage Caption