నేడు ఉమ్మడి నల్లగొండలో షర్మిల పర్యటన

ABN , First Publish Date - 2021-06-16T12:28:17+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం షర్మిల పర్యటించనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావట్లేదని నిరసిస్తూ ఇటీవల

నేడు ఉమ్మడి నల్లగొండలో షర్మిల పర్యటన

హైదరాబాద్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం షర్మిల పర్యటించనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావట్లేదని నిరసిస్తూ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నిరుద్యోగి నీలకంఠ సాయిని ఆమె పరామర్శిస్తారు. అక్కడే పలువురు నిరుద్యోగులతోనూ ఆమె మాట్లాడనున్నారు. ఆ తర్వాత కోదాడ సమీపంలోని దొండపాడు గ్రామానికి వెళ్లి కరోనాతో ఇటీవల చనిపోయిన తమ కుటుంబ సన్నిహితుడు.. గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.  

Updated Date - 2021-06-16T12:28:17+05:30 IST