షర్మిల వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-09-15T05:39:12+05:30 IST

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగప్రకటనలు వేయాలనే డిమాండ్లతో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరసన దీక్షలు చేపడుతున్నారు.

షర్మిల వర్సెస్‌ టీఆర్‌ఎస్‌
పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

-  ప్రజాప్రస్థానం  పాదయాత్రలో  తీవ్ర ఆరోపణలు

- మంత్రి నిరంజన్‌రెడ్డి, షర్మిల మధ్య  మాటల యుద్ధం

-  స్పీకర్‌కు ఫిర్యాదుతో ఆసక్తికర మలుపు

- భవిష్యత్‌ పరిణామాలపై అందరి దృష్టి 

 నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగప్రకటనలు వేయాలనే డిమాండ్లతో  వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోనూ గతేడాది షర్మిల దీక్ష  చేపట్టారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వైఎస్‌ షర్మిలనుద్దేశించి మంగళవారం మరదలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మొదలైన రగడ చినికిచినికి గాలి వానలా తయారైంది. చివరకు పాదయాత్రలో మరింత ఉధృతమైంది. వీరి మధ్య మాటల యుద్ధం అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. అయినా షర్మిల తగ్గేదేలే అన్నట్లు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలకు, పాల మూరు టీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్‌ షర్మిల అగస్టు తొమ్మిదినుంచి పాదయాత్ర ప్రారంభించింది. పాద యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలపై చేస్తోన్న వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధానం గా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి, వైఎస్‌ షర్మి లకు మధ్య నడిచిన సంవాదం, ఎమ్మెల్యేలపై వైఎస్‌ షర్మిల చేసిన తీవ్రస్థాయి ఆరోపణలతో ఉమ్మడి జిల్లా రాజకీ యాల్లో కలకలంరేగింది. చట్టసభల సభ్యులమైన తమపై వైఎస్‌ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ హ క్కులు, గౌరవానికి భంగం కలిగించారని, ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మంత్రి, ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఎవరికి ఫిర్యాదు చేసి నా తాను భయపడేది లేదంటూ షర్మిల అదే స్థాయిలో ప్రతిస్పందించడంతో రాజకీయంగా ఎలాంటి పరిణామా లు చోటుచేసుకోబోతున్నాయనే ఆసక్తి మొదలయింది.

ఈ యాత్రలో ఆమె ఎక్కడ మాట్లాడినా, సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే లపై షర్మిల కామెంట్స్‌ డోసు పెరగడం, రాజకీయ అంశాలను దాటి ఆమె లేవనెత్తుతోన్న అంశాలుండడం తో రాజకీయవర్గాలతో పాటు, సోషల్‌మీడియాలో, ప్రజ ల్లోనూ చర్చ మొదలైంది. ఇది టీఆర్‌ఎస్‌ నేతలకు కంట గింపుగా మారింది. ఈ నేపథ్యంలో చట్టసభల సభ్యుల మైన తమ హక్కులకు, గౌరవానికి భంగం కలుగుతోం దని, ఇందుకు  షర్మిలపై చర్యలు తీసుకోవాలని మం త్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు  ఎమ్మెల్యే లు లక్ష్మారెడ్డి,  ఆల వెంకటేశ్వరరెడ్డి, కాలే యాదయ్య,  దాస్యం వినయ్‌భాస్కర్‌ తదితరులు మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశా రు. ఆయన ఈ ఫిర్యాదుని ప్రివిలేజ్‌ కమిటీకి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఈ నేతలు ప్రకటించడంతో రాజకీయదుమారం మొదలైంది. ఈ ఫిర్యాదుపై వైఎస్‌ షర్మిల సైతం ఘాటుగానే స్పందిం చారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె స్పీకర్‌ తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలు అంటూ  కించపరచడం తనతో పాటు మహి ళలను అవమానపరిచేలా మాట్లాడిన మంత్రిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలపై తాను చేస్తోన్న వ్యాఖ్య లు, విమర్శలు, ఆరోపణలపై షర్మిల స్పంది స్తూ ప్రజల కిచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నెరవేర్చలేదని, వాటిని తీర్చాలనే డిమాండ్‌ తోనే తన పాదయాత్ర నడుస్తోందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తోన్నప్పుడు అక్కడి ప్రజల నుంచి వస్తోన్న సమాచారం, ఫిర్యా దుల ప్రకారమే తాను మాట్లాడుతున్నానని పేర్కొ న్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల మాదిరిగా వెళ్లి తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసినా తాను భయపడేది లేదని, సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు వస్తే ఏం చేయాలో తమకు తెలుసని,  తనను భయపెట్టాలని చూస్తే  కుదరదని, ప్రజల కోసం తాను ఎంత వరకైనా పోరాడుతానని షర్మిల పేర్కొన డం గమనార్హం. 

 



Updated Date - 2022-09-15T05:39:12+05:30 IST