Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యూహాలకు పదును

నేటి నుంచి టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమావేశాలు

7, 8 తేదీల్లో విహారయాత్ర

9న హైదరాబాద్‌లో శిబిరం

కాంగ్రెస్‌ మద్దతు ఎవరికో?

నేడు నల్లగొండలో ఆ పార్టీ నేతల భేటీ

ప్రచారం ప్రారంభించిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): మరో పది రోజుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఎన్నికలో పకడ్బందీగా వ్యవహరించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. తొలుత నియోజకవర్గాల వారీగా ఓటర్లతో సమావేశం నిర్వహించి, 7వ తేదీన ఓటర్లను విహారయాత్రకు, అక్కడి నుంచి 9న హైదరాబాద్‌లోని రిసార్ట్‌లో బస, 10న నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా ప్రణాళి క రూపొందించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యధికులు కాంగ్రెస్‌ వారే కాగా, ఉమ్మడి అభ్యర్థి కోసం చేసిన కసరత్తు నేటికీ ఫలించలేదు. అయితే నగేష్‌, లేదంటే లక్ష్మయ్యల్లో ఒకరికి కాంగ్రెస్‌ తెర వెనుక మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నగేష్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా, కాంగ్రెస్‌ పెద్దలు కలిసి వస్తారా అనే చర్చ సాగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గరపడుతుండటంతో మంత్రి జగదీ్‌షరెడ్డి రంగంలోకి దిగారు. ఈ నెల 1వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు ప్రతిరోజు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఖరారు చేశారు. తొలుత దేవరకొండ ఓటర్లతో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌నాయక్‌ భేటీ కానున్నారు. ఆ తరువాత మిగతా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈనెల 7న ఓటర్లందరినీ విహారయాత్రకు తరలించనున్నారు. 7న కాళేశ్వరం, 8న మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు చూపించి అదేరోజు రాత్రికి హైదరాబాద్‌ పరిసరాల్లోని రిసార్ట్‌లకు ఓటర్లను చేరవేయాలనేది అధికార పార్టీ ప్రణాళిక. డివిజన్ల వారీగా హైదరాబాద్‌లో వేర్వేరు రిసార్ట్‌ల్లో ఓటర్లను బస చేయించనున్నారు. 8, 9వ తేదీ రాత్రి విందు ముగించి, 10న ఉదయాన్నే రిసార్ట్‌ల నుంచి నేరుగా ఆయా డివిజన్లకు విలాసవంతమైన బస్సుల్లో ఓటర్లను తరలించనున్నారు. ప్రాధాన్య క్రమంలో ఓటు వేయాల్సి ఉన్నందున అందుకు ఓటర్లకు శిక్షణ సైతం ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓటు ఇచ్చి వదిలేయాలని ఓటర్లకు పార్టీ పెద్దలు సూచిస్తున్నారు. రెండో ప్రాధాన్య ఓటుకు జోలికి వెళ్లకుండా, ఎన్నికల కమిషన్‌ నిబంధనలపై ఓటర్లకు నియోజకవ ర్గ సమావేశాల్లో, ఎన్నికల క్యాంప్‌లో శిక్షణ ఇవ్వనున ్నారు. నియోజకవర్గస్థాయి ఓటర్ల స మావేశానికి సబంధించిన సమాచారం ఒకరోజుముందే తెలపనున్నారు. 


ఓటర్లు జారిపోకుండా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం 1259 మంది ఉన్నారు. వీరితోపాటు 19 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు మొత్తం 1278 మంది ఓటర్లు ఉండగా, పలు కారణాలతో అందులో ఏడు స్థానాలు ఖాళీ ఉన్నాయి. 1271 మంది ఓటర్ల లో టీఆర్‌ఎ్‌సకు చెందిన వారు 791మంది, కాంగ్రె్‌సకు 396, బీజేపీకి 37, సీపీఎంకు 17, సీపీఐకి 5, ఇతరులు 13 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే టీఆర్‌ఎ్‌సకు ఆధిక్యంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నిక లు ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 200 మందికిపైగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకొని ఉంటారని అంచనా. అంటే సుమారు 1000 ఓట్ల దాకా అధికార టీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్నట్టు లెక్కకడుతున్నారు. అయితే ఓట ర్లు జారిపోకుండా, కనీసం ఏ అభ్యర్థికి టచ్‌లోకి వెళ్లకుండా టీఆర్‌ఎస్‌ పకడ్బందీగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గస్థాయి సమావేశాలు ముగియగానే క్యాంపునకు తరలించి అక్కడి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందించింది.


కాంగ్రెస్‌ మద్దతు నగేష్‌కు లేదంటే లక్ష్మయ్యకు

అధికారికంగా పోటీలో లేని కాంగ్రెస్‌ ఈ ఎన్నికలో ఎలా వ్యవహరించనుందనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్రులు అంతా కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేయాలని ప్రాథమికంగా అభ్యర్థులంతా నల్లగొండలో ఇప్పటికే సమావేశమై ఓ నిర్ణయం తీసుకున్నా అది ఆచరణకు నోచుకోలేదు. ఎంపీటీసీల ఫోరం నుంచి నామినేషన్లు వేసిన వారు తాము తప్పుకుంటామని, బరిలో ఉండేది ఎవరో తేల్చాలని స్పష్టం చేశారు. అయినా ఇప్పటికీ ఆ విషయం తేలలేదు. తన అనుచరుడు, నల్లగొండ జడ్పీటీసీ లక్ష్మయ్య బరిలో ఉండాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుపడుతున్నా రు. తాను చెబితే ఎన్ని ఓట్లు పడతా యో నియోజకవర్గాల వారీగా వెంకట్‌రెడ్డి ఇప్పటికే ఓ అంచనాతో ఉన్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఆలేరు జడ్పీటీసీ కుడుదుల నగేష్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌, సీపీఎం, ఇతర పార్టీల ఓటర్లను కలిశారు. కాంగ్రెస్‌ దిగ్గజాలు జానారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిని సైతం నగేష్‌ కలిశారు. ఇదిలా ఉంటే సీపీఎం, సీపీఐ, బీజేపీ తమ మద్దతు ఎవరికనేది తేల్చలేదు.


ఎన్నికను పక్కాగా నిర్వహించాలి

ప్రిసైడింగ్‌ అధికారుల శిక్షణలో కలెక్టర్‌ పీజే.పాటిల్‌ 

నల్లగొండ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలను నిబంధనల ప్రకా రం నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో మొత్తం ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కు ఒకరోజు ముందుగానే పోలింగ్‌ సిబ్బంది సంబంధిత జిల్లా కలెక్టరేట్లలో రిపోర్టు చేసి, ఎన్నిక సామగ్రిని తీసుకోవాలని సూచించారు. డిసెంబరు 10న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వర కు పోలింగ్‌ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక బ్యాలెట్‌ బాక్సులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ సెంటర్‌లో అందజేయాలన్నారు.


అభ్యర్థులు నిబంధనలు పాటించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు. అభ్యర్థులతో కలెక్టర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించి, ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ర్యాలీలు నిషేధమని, పో లింగ్‌ రోజు అభ్యర్థి తిరిగేందుకు రెండు వాహనాలు మాత్రమే అనుమ తి ఉంటుందని, అందుకు రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలన్నారు. ఎన్నికల ఏజెంట్‌, పోలింగ్‌ ఏజెంట్‌, కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాలని, ఆ వివరాలు డిసెంబరు 4లోగా సమర్పించాలన్నారు. డిసెంబరు 9న నల్లగొండ, సూర్యాపేట, భువనగరి కలెక్టరేట్లలో ఎన్నికల అధికారులకు సామగ్రి అందజేస్తామని, దీనికి అభ్యర్థులు, వారి ప్రతినిధులు హాజరుకావాలన్నారు. అదేవిధంగా పోలింగ్‌ ముగిశాక అభ్యర్థు ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలో బ్యాలెట్‌ బాక్స్‌లు, పోలింగ్‌ సామగ్రి భద్రపరుస్తామన్నారు. సమావేశాల్లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కాసం వెంకటేశ్వర్లు, రాంసింగ్‌, బెజ్జం సైదులు, అరుపుల శ్రీశైలం, నగేష్‌, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement