Abn logo
Jun 7 2020 @ 09:58AM

మాధ‌వ‌న్ చిత్రంలో షారూక్‌..!

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ 2018లో న‌టించిన చిత్రం ‘జీరో’. ఈ చిత్రం డిజాస్ట‌ర్ కావ‌డంతో షారూక్ మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు హీరో మాధ‌వ‌న్ న‌టిస్తున్న ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌’లో షారూక్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. జీరోలో మాధ‌వ‌న్ అతిథి పాత్ర‌లో క‌నిపించారు. అందుకోస‌మే రాకెట్రీ చిత్రంలో షారూక్ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్‌ను ఇంట‌ర్వ్యూ చేసి, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేసే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో షారూక్ ఖాన్ క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement